calender_icon.png 7 August, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చేనేత దినోత్సవం

07-08-2025 04:36:26 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బెజ్జుర్ చేనేత సహకార సంఘంలో గురువారం ప్రపంచ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత కార్మికులకు నూలు పోగు దండలు వేసి సత్కరించారు. అనంతరం చేనేత వస్త్రాలు ధరించాలి.. చేనేత కార్మికులను ప్రోత్సహించాలని నినాదాలు చేస్తూ కార్మికుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సింధం చంద్రయ్య ,రాపెల్లి సదానందం, గుల్లపెళ్లి నాగేశ్వరరావు, గడదాసు మల్లయ్య, వడ్నాల వెంకన్న,నూతి సుదర్శన్, మామిడాల రామకృష్ణ, కొంపల్లి సుదర్శన్,అల్లి గురువయ్య,దండే భిమయ్య, నులిగొండ సత్యనారాయణ, తౌటం చంద్రమౌళి,భోగ వెంకటేశం చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు