calender_icon.png 7 August, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు డ్రగ్ విక్రయదారులను అరెస్ట్ చేసిన ఎస్.ఓ.టి. పోలీసులు

07-08-2025 04:38:11 PM

గచ్చిబౌలి (విజయక్రాంతి): గచ్చిబౌలి ఖజాగూడా పరిధిలో బ్రౌన్ షుగర్ డ్రగ్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను శంషాబాద్ ఎస్.ఓ.టి. పోలీసులు(Shamshabad SOT Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎం.డి. నూర్ అక్తర్(28), ఎం.డి. అజత్ మోమిన్(32) అనే ఇద్దరు వ్యక్తులు హెరాయిన్, బ్రౌన్ షుగర్ డ్రగ్‌లను తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 66 గ్రాముల హెరాయిన్, బ్రౌన్ షుగర్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ సరఫరా చేసే నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు, ఇంతక ముందు ఎన్ని సార్లు డ్రగ్ అమ్మారు, ఎవరికి అమ్ముతున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.