07-08-2025 04:34:48 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్(Sub-Collector Sai Manoj Varaprasad) ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో బుగ్గ సందర్శించారు. ఈ సందర్భంగా పురాతన శివాలయం గురించి తెలుసుకొని అక్కడే శ్రావణమాసం సందర్భంగా పూజల్లో పాల్గొన్నారు. బుగ్గ దేవాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్ ను ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి, సతీష్ శర్మలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తాసిల్దార్ కృష్ణ,బుగ్గ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కన్నాల మాజీ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప, ట్రస్ట్ సభ్యులు వెంకటస్వామి, మురుకూరి బాలకృష్ణ, భావన్లపల్లి భరత్ పాల్గొన్నారు.