calender_icon.png 7 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

06-08-2025 10:55:38 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారిగా ఇప్పటివరకు పరిష్కరించిన భూభారతి దరఖాస్తుల వివరాలను తహసీల్దారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటిని వారంలోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లయితే, తిరస్కరణకు సంబంధించి కారణాలను తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. అన్ని రకాల పౌర సేవలను గుర్తింపు పత్రాలను వెంటవెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆయా పత్రాల జారీ ప్రక్రియలో ఆలస్యం చేయకూడదని అన్నారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న  కుల, ఆదాయ, నివాస, తదితర ధ్రువీకరణ పత్రాల వివరాలను తాసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించాలని చెప్పారు. కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీని సకాలంలో పూర్తి చేయని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని అన్నారు. సదరు రైస్ మిల్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు వినగాడ వద్దని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి, ఏడి సర్వే & ల్యాండ్ రికార్డ్ ఆర్ సుదర్శన్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.