calender_icon.png 7 August, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మిక సంఘం 5వ మండల మహాసభను జయప్రదం చెయ్యండి

07-08-2025 04:30:09 PM

సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం..

మునగాల (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంఘం(సిఐటియు అనుబంధం) 5వ మండల మహాసభను చేయపదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం(CITU District Committee Members Bachalakura Swarajyam) భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) 5వ మండల మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రిలు సెంట్రింగ్, రాడ్ బెండింగ్, పెయింటింగ్, ఎలక్ట్రిషన్, మార్బుల్స్,టైల్స్,మట్టి పని వారు, ఇటుక బట్టి కార్మికులు తదితర 54 రకాల వృత్తుల కార్మికులు పనిచేస్తున్నారు.

సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వారికి తెలియజేస్తూ కార్మికులు వారి హక్కుల కొరకు పోరాడి సాధించుకున్న చట్టాలను, నేడు కేంద్రo లో ఉన్న నరేంద్ర మోడీ  ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ వలన కార్మిక వర్గానికి ఏ విధంగా నష్టం జరుగుతున్నదో తెలియజేస్తూ కార్మికులను ఐక్యపరుస్తూ. ఆగస్ట్ 18న జరుగుతున్న మునగాల మండల 5వ మహాసభలను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికు లను కోరినారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ దస్తగిరి, సహాయ కార్యదర్శి అల్లి నాగరాజు, షేక్ జాన్ పాషా, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.