calender_icon.png 7 August, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ గృహాలు అందేలా కృషి..

07-08-2025 04:45:07 PM

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ గృహాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు(MLA Palvai Harish Babu) అన్నారు. గురువారం కన్నెపల్లి మండలంలోని మాడవెల్లి, సాలిగాం గ్రామాలలో ఆయన పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేసిన ధ్రువీకరణ పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం గ్రామంలో నాయకులతో కలిసి పాల్వాయి హరీష్ బాబు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు వెంకట నర్సింగరావు, కన్నెపల్లి, భీమిని మండలాల అధ్యక్షులు పప్పుల రామాంజనేయ, లక్ష్మీనారాయణ, మాజీ మండల ఉపాధ్యక్షులు రాకేష్, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏల్పుల రోహిత్ తదితరులు పాల్గొన్నారు.