calender_icon.png 20 December, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాడ్గే బాబా, బీమా భాయ్ ల వర్ధంతి

20-12-2025 05:24:13 PM

వాంకిడి(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శనివారం స్వచ్ఛ భారత్ పితామహుడు వాగ్గేయ కారుడు  సంత్ గాడ్గే బాబా 69వ వర్ధంతి,అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తల్లి భీమ బాయ్ 139వ వర్ధంతి  కార్యక్రమాన్ని భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బుద్ధ వందన చేసి వారి గత స్మృతులను గుర్తు చేసుకొన్నారు. గాడ్గే బాబా తనంజీవితంలో స్వచ్ఛత కు పెద్ద పీట వేయగా,భీమబాయి అంబేద్కర్ని చదివించడంలో  చేసిన కృషి నేటికి ఆదర్శమని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహుల్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్,మహామత్మ జ్యోతి రావు పూలే ల తర్వాత గాడ్గే బాబా ను అభివర్ణిస్తారని ఆయన అన్నారు.

గౌరవ అధ్యక్షుడు జయరాం ఉప్రే, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దుర్గం సందీప్ లు మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తినీ భారత దేశానికి అందించిన భీమ బాయి నేటి తల్లులకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి రోషన్ ఉప్రే, ప్రతాప్,సమాజ అధ్యక్షులు శ్యామరావు లహుజీ దర్గే, రాజేశ్వర్ ఉప్రే,కోశాధికారి నాగ సేన్ ఉప్రే, మాలిసంఘం నాయకులు నానాజీ,దినేష్, అంబేడ్కర్ సంఘం నాయకులు పెరుగు జయంత్ కుమార్ , విఠల్,రమేష్, బల్వంత్ ఉప్రే,అరుణ్,ప్రశాంత,తదితరులు పాల్గొన్నారు.