calender_icon.png 20 December, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతకుంటవాడలో అయ్యప్ప పడిపూజ

20-12-2025 05:54:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. కాలానికి చెందిన అమ్ముల రాజు, ధర్మేందర్, సిద్దు, గురుస్వాములు  మహా పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. పూజలో వేసినటువంటి అరటి మండపంలో చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో గురుస్వాములు చేనిగారపు చిన్నయ్య, మూర్తి నందు,కందుల శేఖర్, కోటగిరి గోపి, బద్రి శ్రీనివాస్, కనపర్తి విగ్నేష్, అడప పోశెట్టి, సాయన్న, భక్తులు పాల్గొన్నారు.