calender_icon.png 20 December, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుల సమస్యలు పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ నితికా పంత్

20-12-2025 05:22:27 PM

వాంకిడి,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని పోలీస్ అధికారులను  జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశించారు. శనివారం వాంకిడి పోలీస్ స్టేషన్ ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు, రికార్డులు, సిబ్బంది విధులు తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులపై మర్యాదగా మెలగాలని ఫిర్యాదులను తక్షణమే విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట వాంకిడి సిఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.