calender_icon.png 20 December, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటించాలి

20-12-2025 06:06:03 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, కాబట్టి వాహనదారులకు రహదారి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  రాష్ట్రంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత జిల్లా శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెలంగాణ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తు ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తోందని చెప్పారు. వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. కాబట్టి వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. రవాణా, పోలీస్, ఆర్టీసీ, సంబంధిత శాఖలు సమన్వయము చేసుకొని మాసోత్సవాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తప్పనిసరిగా రోడ్ సేఫ్టీ మీటింగ్స్ నిర్వహించాలన్నారు.  

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, కాబట్టి వాహనదారులకు రహదారి భద్రత పై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశం లో ఆర్ అండ్ బి ఈ ఈ దేశ్యా నాయక్, డి టీ ఓ మానస, డి ఎం హెచ్ ఓ సాయినాథ్ రెడ్డి, పంచాయత్ రాజ్ ఈ ఈ మల్లయ్య, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.