calender_icon.png 20 December, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతి దేవుని ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

20-12-2025 05:44:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణ చందా మండలం ధర్మారం గ్రామంలో కోతి దేవుని ఆలయాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్,  మండల అధ్యక్షులు చిన్నయ్య, మాజీ ఎంపీపీ  అడ్వాల రమేష్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జమాల్, నాయకులు శ్రీధర్ రెడ్డి, మల్లేష్, శంకర్,  పీచర సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ వినీత్, తో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.