calender_icon.png 20 December, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తాను: సర్పంచ్ శేషిరెడ్డి

20-12-2025 05:52:37 PM

భవనం లేని గ్రామానికి సర్పంచ్ ను

మోతె,(విజయక్రాంతి):  గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తానని సర్పంచ్ శేషి రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కొత్త గూడెం గ్రామంలో సుమారు 550 ఓట్లు ఉన్నాయని గ్రామ పంచాయతీ భవనం లేదని నూతన భవనం ఏర్పాటు చేయాలని పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేసి కొత్త గూడెం నుంచి రామ చంద్ర పురం వరకు రహదారి ఏర్పాటు చేసి వ్యవసాయ భూములకు వెళ్ళడానికి డొంక దారులన్నీ రహదారులుగా మార్చడానికి కృషి చేస్తానని చెప్పారు.

నియోజకవర్గ కేంద్రానికి  మారు మూల గ్రామం కొత్త గూడెం ఉండడం తో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని యస్సి కాలానిలో విద్యుత్ సమస్య ఉన్నది కరెంట్ స్థంభాలు అవసరం ఉన్నదని ప్రతి విధులలో వీధి దీపాలకోసం విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య వికలాంగులు, ఒంటరి మహిళ లు, వితంతువు పెన్షన్ లు అందించడానికి కృషి చేస్తానని చెప్పారు.