20-12-2025 05:27:16 PM
ముకరంపుర,(విజయక్రాంతి): ఉపాధి హామీ రక్షణ కోసం23న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏఐఎఫ్బీ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి తెలిపారు. శనివారం అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం పార్టీ ఆఫీసులో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొట్లాడి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు గ్రామీణ ప్రజలంతా కలిసికట్టుగా నడవాలని, ఈ నెల 23 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు జయ్రపదం చేయాలని, వామపక్ష పార్టీల నేతలతో కలసి పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ లీగ్ రాష్ట్ర కన్వినర్ రావుల ఆదిత్య, నగర అధ్యక్షులు సత్యారావు, జిల్లా కమిటీ సభ్యులు బద్రినేత, ప్రశాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.