calender_icon.png 3 May, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో ఇండియన్ హై స్కూల్ ప్రభంజనం

03-05-2025 01:39:55 AM

వరంగల్, మే 2 (విజయ క్రాంతి): పదో తరగతి ఫలితాల్లో వరంగల్ నగరంలోని పుప్పాలగుట్ట ఇండియన్ హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

ఉపాధ్యాయుల కృషి, పట్టుదలతో చదివి విద్యార్థులు 10 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మరోసారి ఇండియన్ హై స్కూల్ కీర్తిని ప్రకాశింపజేశారని పాఠశాల కరస్పాండెంట్ వన్నాల గోవిందరాజులు, కరస్పాండెంట్ వన్నాల ఉమాదేవి, ప్రిన్సిపల్ వన్నాల వికాస్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 600 మార్కులు గాను పదిమంది విద్యార్థులు 550 మార్కులు, 23 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.

ఆయోష సనోబార్ 582, ఎస్.జస్వంత్ 569, ఎన్.విష్ణు 565, డి.కార్తీక్ 564, ఫాతిమా నిక్కత్ 562, ఏం.జస్వంత్ 562, మిస్బా కౌనిక్ 560, సయ్యద్ మోహినుద్దీన్ హుస్సేన్ 558, బి.నందిత 560, జీ.వర్షిని 551 మార్కులతో ఉత్తీర్ణులయ్యారని, పాఠశాలకు చెందిన 46 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను, తమ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.