10-07-2025 09:29:54 PM
ఎంతో సౌమ్యంగా విద్యను బోధించేవారు..
ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం..
40 ఏళ్ల తర్వాత గురువును కలిసి సన్మానించడం ఆనందం..
కామారెడ్డి (విజయక్రాంతి): గురు పౌర్ణమి(Guru Purnima) సందర్భంగా చిన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం విద్య నేర్పిన గురువును సన్మానించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తండ్రి రాజేశ్వరరావు దంపతులను కామారెడ్డిలోని అశోక్ నగర్లో ఆయన నివాసంలో ఘనంగా చిన్ననాటి జ్ఞాపకాలను గురువుతో 40 సంవత్సరాల క్రితం విద్య బోధించిన చిన్ననాటి శిష్యులు ఇంటికి వచ్చి సన్మానించి అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు దంపతులు తెలిపారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటిసారి గాంధారిలో తమకు గురువు రాజేశ్వరరావు, విద్య భోజనం చేశారని తెలిపారు.
రాజేశ్వరరావు అతని సతీమణి వజ్రమ్మలకు 85 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు సమకూర్చి ఆరోగ్యంగా జీవించడం ఆయన గురువు స్థానంలో ఉండి నిస్వార్ధంగా శిష్యులకు విద్యను బోధించడం వల్లనే ఆ భగవంతుడు భార్యాభర్తలను అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాడని ఈ సందర్భంగా శిష్యులు కొనియాడారు. ఉపాధ్యాయుడిగా పని చేసిన రాజేశ్వరరావు ఎప్పుడు అబద్ధాలు చెప్పని వారిని కలియుగ ధర్మరాజుగా పిలిచే వారిమని శిష్యులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సన్మానించిన శిష్యులు. ఇంజామూరి శ్రీనివాస్, గండివేట్,నారాయణ, మనోహర్ పట్వారి, ముదిల్లి నారాయణ, శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.