తగ్గిన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు

24-04-2024 01:05:27 AM

న్యూఢిల్లీ ఏప్రిల్  23: దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాల కారణంగా ముగిసిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ెేఫిబ్రవరి మధ్యకాలంలో భారత్ వ్యవసాయోత్ప త్తుల ఎగుమతులు 9 శాతం క్షీణించి 43.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా యుద్ధం, ఎర్ర సముద్రం సంక్షోభంతో పాటు కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించడమూ తగ్గుదలకు దారితీసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022 ఏప్రిల్ మధ్యలో 47.9 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తులు ఎగుమతికాగా, 2023 43.7 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

బియ్యం, గోధుమ, చక్కెర, ఉల్లి తదితరాల ఎగుమతులపై నిషేధం, నియంత్రణలు విధించడం గత ఏడాది క్షీణతకు దారితీసినట్టు వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే తాజా పండ్లు, ప్రాసెస్డ్ కూరగాయలు, బాస్మతి బియ్యం, అరటి ఎగుమతులు పెరిగాయన్నారు. ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం ప్రస్తుతం ఎగుమతులపై కన్పించడం లేదని, తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.