calender_icon.png 25 September, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దీన్ దయాల్ జయంతి వేడుకలు

25-09-2025 05:35:49 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ... దీనదయాళ్ ఉపాధ్యాయ్ సూత్రం అంత్యోదయను ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఆయన సిద్ధాంతం ఎంతో గొప్పదని, ఇంటిగ్రల్ హ్యూమనిజం ఈ దేశానికి అత్యవసరం అన్నారు. ఆయన ఆలోచనలు తప్పకుండా మనకు తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పరచే దిశగా నడిపిస్తాయి అని అన్నారు.