calender_icon.png 22 October, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బిజెపి నుంచి దీపక్ రెడ్డి నామినేషన్

21-10-2025 02:57:27 PM

హైదరాబాద్: రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో(Jubilee Hills Assembly by-election) పోటీ చేయడానికి బీజేపీ(BJP) అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి(Lankala Deepak Reddy) మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళ చివరి రోజు కావడంతో ఆయన షేక్‌పేట్‌లోని ఎంఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకు ముందు వెంకటగిరి హైలం కాలనీ నుంచి బీజేపీ నామినేషన్ ర్యాలీ నిర్వహించింది. డప్పులు, నృత్యాలు, వివిధ కళారూపాల మధ్య నామినేషన్ ర్యాలీ తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్యెల్యేలు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బిఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.  భారత ఎన్నికల సంఘం (ECI) అక్టోబర్ 22న నామినేషన్లను పరిశీలిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్, కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.