calender_icon.png 22 October, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

21-10-2025 10:50:13 PM

పోలీస్ అమర వీరులకు కొవ్వొత్తులతో ర్యాలీ..

బెజ్జంకి: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగవారం ఎస్ఐ స్థానిక ప్రజలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. 

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు, పోలీస్ సిబ్బంది, లింగాల లక్ష్మణ్, నారెడ్డి సుదర్శన్ రెడ్డి, గుబిరే మల్లెషం, శేఖర్,మోహన్, పర్శరాములు, బండారి రాములు, నరసింహా రెడ్డి స్థానికులు పాల్గొన్నారు.