21-10-2025 10:53:55 PM
ప్రతి అమావాస్యకు అన్నదానం..
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): అన్నదానం అన్ని దానాల కంటే మిన్న అనే నినాదంతో ప్రతి నెల అమావాస్య రోజున నిరుపేదలకు అన్నదానం చేస్తూ పంచాక్షరి అన్నదాన సేవా సమితి ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. 2018 దీపావళి రోజున ఐదుగురు స్నేహితులు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలనే సేవా దృక్పథంతో ఖమ్మం వైరా రోడ్ లో గల జలాంజనేయ స్వామి గుడి ముందర ప్రారంభించిన ఈ సమితి, నేటికీ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.
సమితి అధ్యక్షులుగా జవ్వాజి వీరాంజనేయులు, కోశాధికారులుగా తాటికొండ మల్లికార్జున్, గాయత్రి, జనరల్ సెక్రటరీగా చిలుకూరు ఉపేందర్, సభ్యులుగా పంతంగి శ్రీ కోటేశ్వరరావు, మానప్రగడ రమేష్, జంజీరాల శ్రీకాంత్, శ్రీజ, గుంటూరు నాగేశ్వరరావు, పడాల శ్రీనివాసరావు, జనార్ధన్ గుప్త, చుండూరు అజయ్, గుడిపూడి సుహాసిని, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
పంచాక్షరి ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులు
2021 నుండి ప్రతి సంవత్సరం దుర్గానవరాత్రి వేళ కుంకుమపూజ, సరస్వతీ పూజ, అన్నవితరణ కార్యక్రమాలు, సద్దుల బతుకమ్మ వేడుకలను బోనకల్ రోడ్ జవ్వాజి రెసిడెన్సీ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు తెలిపారు.