calender_icon.png 21 October, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ దవాఖానను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు

21-10-2025 01:21:39 PM

హైదరాబాద్: బస్తీ ప్రజలకు తమ గడప దగ్గరే వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రం మొత్తంలో 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. వాటిలో 110 రకాల మందులను, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారని గుర్తు చేశారు. కానీ 22 నెలల కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకే సుస్తీ పట్టుకున్నదని హరీశ్ రావు ఆరోపించారు. లింగంపల్లిలో ఉన్న బస్తీ దవాఖానను ఆయన పరిశీలించారు. అక్కడి సిబ్బందిని దవాఖాన యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమకు 5-6 నెలల నుండి జీతాలు రావడం లేదని, నిత్యావసరమైన మందులు కూడా అందుబాటులో లేవని సిబ్బంది  బాధపడుతున్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక నల్లా నీళ్ళకు బిల్లులు వేసి పైసలు వసూలు చేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే బస్తీ దవాఖానాలు బాగుపడతాయని ఎమ్మెల్యే హితవు పలికారు.