calender_icon.png 22 October, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులకు వాలీబాల్ కిట్లను అందజేసిన ఎస్సై

21-10-2025 11:06:08 PM

పెద్ద పేటలో నిరుపేదకు బియ్యం అందజేత..

భీమిని (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమినీ మండలంలోని పెద్ద పేట గ్రామానికి చెందిన నిరుపేద మహిళ ఫాతిమాబీకి మంగళవారం 15 కేజీల బియ్యం, వంట సామాగ్రిని ఎస్ఐ విజయ్ కుమార్ అందించాడు. రాజారం గ్రామానికి చెందిన యువకులు ఆటలు కనబరుస్తున్న ఆసక్తిని గమనించిన ఎస్సై పిల్లలకు వాలీబాల్ కిట్లను అందించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ. యువకులు చదువుతో పాటు ఆటలో శ్రద్ధ కనబరిచి మంచి నడవడికతో మెదులుతూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి వాటిలోకి వెళ్లకుండా సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఆటల వల్ల శరీరధారోగ్యం పెరగడంతో పాటు మానసికంగా ఎంతో పరిణీతి సాధించడం కోసం ఆటలు ఉపయోగపడతాయని ఎస్ఐ అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించి సహకారం అందించాలని ఎస్ ఐ అన్నారు. ఎస్ఐ వెంట సిబ్బంది వినోద్ కుమార్ తదితరులున్నారు.