21-10-2025 10:43:00 PM
ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి..
ఇబ్రహీంపట్నం: శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులదే కీలక పాత్ర ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం “పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం” సందర్బంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్బంగా సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో పోలీసు యంత్రాగానిదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. నేను పోలీసుగా ఉన్నందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు కె. రామకృష్ణ పి. నాగరాజు, వి.చందర్ సింగ్, సూర్యతేజ, ఉమెన్ ఎస్ఐ సుమల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.