21-10-2025 11:02:21 PM
టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్న జిల్లా ప్రజలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దీపావళి వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే తలంటు స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి కుటుంబ సమేతంగా హారతులు తీసుకున్నారు. అనంతరం స్వీట్లు, పేనీలు, సాంగులు చేసుకుని తిన్నారు. కుటుంబ సమేతంగా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం వ్యాపారులు తమ దుకాణా సముదాయాలలో లక్ష్మీ పూజలను నిర్వహించారు. లక్ష్మీ ఫోటో ముందు డబ్బులు పెట్టి కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో కలిసి లక్ష్మీ పూజలు నిర్వహించి టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో జిల్లా ప్రజలు పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు.