calender_icon.png 22 October, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు..

21-10-2025 10:45:57 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని గుల్లకోట గ్రామ రాష్ట్ర రహదారిపై లారీ ఢీకొని హర్యానాకు చెందిన పవనకుమార్(40) అనే హార్వెస్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని ఎస్ఐ గోపతి సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గాయపడ్డ పవనకుమార్ హర్యానా రాష్ట్రం శివన్గేట్ అర్జునగర్ కు చెందినవాడని వృత్తిలో భాగంగా జన్నారం మండలం తప్పాలాపూర్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ హార్వెస్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

మంగళవారం ఉదయం స్వంత పని నిమిత్తం గుల్లకోట గ్రామ శివారులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా లక్షేట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తన ఎడమ కాలు తెగి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. హార్వెస్టర్ యజమాని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన లారీ, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ  తెలిపారు.