calender_icon.png 22 October, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత ఇసుక టోకెన్లు పంపిణీ

21-10-2025 10:47:50 PM

చేగుంట: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక టోకెన్లను ఎంపీడీవో చిన్నారెడ్డి, గృహనిర్మాణ శాఖ ఏఈ రియాజాద్దీన్, పిఎస్ సిఎస్ చైర్మన్ మ్యాకల పరమేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రుక్మాపూర్ గ్రామానికి చెందిన 18 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రెండు ట్రాక్టర్ల చొప్పున టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు, లబ్ధిదారులకు మాసాయిపేట మండలంలోని హల్టీ వాగు నుంచి తీసుకెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు.