19-10-2025 08:28:45 PM
అయోధ్య: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య(Ayodhya) నగరం దీపాకాంతులతో వెలిగిపోతుంది. సరయు నది వెంబడి లక్షలాది దీపాలను భక్తులు వెలిగించారు. ఈ దీపోత్సవం(Ayodhya Deepotsav)లో సరయు నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కాగా, ఈ ఏడాది 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సరయు నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడిలో 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, డ్రోన్ షోతో పాటు రామ్ లీల ప్రదర్శన అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీరామ జన్మభూమి ఆలయంలో హారతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవానికి రెండు గిన్నీస్ బుక్ రికార్డులు లభించింది. ఎక్కువమంది పాల్గొన్న దీపోత్సవంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూజల అనంతరం ముఖ్యమంత్రి యోగి ప్రసంగిస్తూ... దీపోత్సవ్-2025 సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దీపోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. "ఈ దీపోత్సవ్ కార్యక్రమం ద్వారా, ఉత్తరప్రదేశ్‌కు ఒక గుర్తింపును సృష్టించడానికి తాము ప్రయత్నించామని అన్నారు.