calender_icon.png 1 May, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సకాలంలో నిర్వహించాలి

01-05-2025 12:08:23 AM

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షులు బి.నర్సింహరావు

హనుమకొండ, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షులు బి.నర్సింహరావు డిమాండ్ చేశారు. బుదవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్  వి.రామచంద్రన్ కు పీడీఎస్‌యూ బృందం వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా కాంపాటి పృథ్వి, బి. నరసింహారావులు మాట్లాడుతూ కేయూ పరిధిలో డిగ్రీ  2, 4, 6 సెమిస్టర్ పరిక్షలు దఫ దఫాలుగా వాయిదా వేయడం జరుగుతుందని, దీని మూలంగా విద్యార్థులకు పీజీ, లా సెట్, బీఎడ్ లాంటి అనేక ఎంట్రన్స్ కోర్సులకు పరీక్షలు రాసుకునే అవకాశం లేకుండా పోతున్నదని, దీనితో ఫైనల్ ఇయర్ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.

గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వాలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మెబాట పట్టాయని,  ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు పరీక్షలు నిర్వహించలేమని చేతులెత్తేశారని తెలిపారు. దీని మూలంగా ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నడుమ విద్యార్థులు నలిగిపోతున్నారని అన్నారు.

తక్షణమే ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించి డిగ్రీ విద్యార్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు అనూష, గణేష్, సహాయ కార్యదర్శి యాదగిరి, శ్రీజ, సాధన యూనివర్సిటీ నాయకులు చారి, లోకేష్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.