calender_icon.png 1 May, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ తొలి జాబితాలో పేదలకే ప్రాధాన్యం

01-05-2025 12:09:52 AM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి 

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం

మునుగోడు, ఏప్రిల్ 30: ఇందిరమ్మ మొదటి జాబితాలో నిరుపేదలకే ప్రాధాన్యం ఇస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మునుగోడులో ఆధునీకరించిన ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయాన్ని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో శ్రీదేవితో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీనవర్గాల సంక్షేమం అభివృద్ధి గురించి చర్చించడానికి క్యాంపు కార్యాలయం నిలయంగా మారుతుందని చెప్పారు.

ప్రజల సమస్యలు చర్చించడానికి, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి  మీటింగ్ హాల్, వ్యక్తిగత సిబ్బందికి అదనపు గదులతో ఆధునికరించారు. ఇది మునుగోడు ప్రజల ఇల్లు అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. క్యాంపు కార్యాలయం శాశ్వతంగా ఉంటుందని స్పష్టంచేశారు. అనంతరం తొలిరోజు క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అన్ని మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్షించారు. నిరుపేద ప్రజలకే తొలి ప్రాధాన్యమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, పున్న కైలాస్ నేత, రవి ముదిరాజ్, ఐలయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.