calender_icon.png 11 August, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రస్సులు అందజేత

11-08-2025 04:43:21 PM

దేవరకొండ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడిపల్లి విద్యార్థులకు శీలం నారాయణ రెడ్డి రిటైర్డ్ పిఈటి సుమారు 45 వేల రూపాయల విలువచేసే స్పోర్ట్స్ డ్రెస్ లను 110 మంది విద్యార్థులకు సోమవారం బహుకరించడం జరిగింది. అనంతరం దాత నారాయణ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే తమ యొక్క లక్ష్యాలను సాధించవచ్చు అని, భవిష్యత్తులో విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని తెలియజేశారు. అనంతరం దాత శీలం నారాయణరెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనయ్య, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి, బోయ సుధాకర్ రెడ్డి, కొమ్ము బక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.