calender_icon.png 11 August, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

11-08-2025 04:46:15 PM

నూతనకల్ (విజయక్రాంతి): మండలంలోని విద్యార్థులకు చిన్నారులకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి సందీప్(Mandal Medical Officer Sandeep), ఎంఈఓ రాములు నాయక్(MEO Ramulu Naik) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ సంవత్సరం నుండి 19వ సంవత్సరంలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ చరణ్ నాయక్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.