calender_icon.png 11 December, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాఘవపురంలో ఇరు పార్టీల ప్రచార జోరు

11-12-2025 06:01:02 PM

మోతె (విజయక్రాంతి): గురువారం మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన రెండు పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. సిపియం పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్ది మంజుల భాస్కర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని మంజుల భాస్కర్ రెడ్డి చెప్పారు. గ్రామంలో నేటికీ పరిష్కారం కానీ పనులన్నింటిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

గ్రామంలో సీసీ రోడ్లు వీధి దీపాలు పూర్వపు డొంక బాటలన్ని రోడ్లు వేయడం జరుగుతుందని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మట్టి పల్లి నీలమ్మ రామల్లు మాట్లాడుతూ గ్రామంలో నన్ను ఆదరించి ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాన్ని చేయడమే నా లక్ష్యమన్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.