calender_icon.png 11 December, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి..

11-12-2025 07:03:09 PM

ఉప్పల్ (విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పుల నరసింహ(65) హైదరాబాద్ నారాయణగూడ నివాసి తన మనవడు రిషివర్ధన్ మనవరాలు తేజవతితో కలిసి ఉప్పల్ లోని ఎన్ఎస్ఎల్ లో మనవరాలైన తేజవతిని ఉద్యోగంలో చేర్పించడానికి తీసుకెళ్తున్న సమయంలో ఉప్పల్ నుండి రామంతపూర్ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కిందపడిపోయాడు. రిషివర్ధన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉండగా నరసింహ మృతిచెందారు. రిషివర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.