11-12-2025 06:38:47 PM
మానకొండూర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామం సిఓఈ గురుకుల పాఠశాలలో విద్యార్థుల బాధలు చూసి చలించిన ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం తన సొంత ఖర్చులతో విద్యార్థులకు స్నానానికి వేడి నీరు అందించాలని సంకల్పం పెట్టుకున్నారు. గురువారం దేవంపల్లి గురుకుల విద్యార్థులు చలి తీవ్రత పెరగడంతో ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం చలించి తన సొంత ఖర్చులతో విద్యార్థులకు వేడి నీరును అందించి విద్యార్థులకు బాసటగా నిలిచాడు. చల్లటి నీళ్లలో రోజు విద్యార్థులు స్నానం చేయడం వల్ల అనేక రకమైన వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఆలోచించి వాటిని విద్యార్థుల దరిచేరకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ప్రిన్సిపల్ వేడినీరు అందించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు.