calender_icon.png 11 December, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య..

11-12-2025 06:46:15 PM

ఉప్పల్ (విజయక్రాంతి): మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై ఏదో ఒక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వరకట్నం వేధింపులతో ఉప్పల్ లో ఓ వివాహిత  ఆత్మహత్యకు పాల్పడింది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేటకు జిల్లా తిరుమలగిరికి చెందిన శ్రీహరి రెండో కుమార్తె అయిన శ్వేత(28) ఈ సంవత్సరం జనగామ జిల్లా దేవ రూపాయలకు చెందిన దామోదర్ శ్రీనివాస్ కి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. కట్నం కింద 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ హైదరాబాదులోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. మొదటి నెల బాగానే ఉన్న శ్రీనివాస్  తన అదనపు కట్నం కావాలని వేధింపులకు గురిచేసేవాడు.

రోజు శారీరకంగా మానసికంగా వేధించడంతో శ్వేత తన కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడేది. ఈ క్రమంలో పెద్దలు మందలిచినప్పటికీ శ్రీనివాస్ వేధింపులు మరింత పెరిగాయి. సొంత కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడిన అనుమానించేవాడు. శ్రీనివాస్ వేధింపులు భరించలేక తల్లిదండ్రులతో చెప్పి భర్త డ్యూటీకి వెళ్లిపోగానే ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. డ్యూటీ నుండి శ్రీనివాస్ తిరిగి వచ్చేలోపు ఫ్యానుకు శ్వేత వేలాడడం చూసి కిందికి దించి ఆస్పత్రి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది. ఆప్పటికే శ్వేత మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్వేత తండ్రి శ్రీహరి మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.