ఢిల్లీ రాత మారేనా?
రాజస్థాన్‌తో కీలక పోరు
స్టార్క్ ఎంట్రీతో ఢిల్లీకి జోష్
జైపూర్, ఏప్రిల్ 30 : ఐపీఎల్ సీజన్ జరిగిన ప్రతీసారీ ఆరంభ మ్యాచ్‌లలో అదరగొట్టడం.. తర్వాత చేతులెత్తేయడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అలవాటుగా మారింది. ప్రస్తుత సీజన్‌లోనూ ఆ జట్టు ఇదే తరహా ప్రదర్శన చేస్తోంది. మొదట వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన ఢిల్లీ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూస్తోంది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడిపోయింది. ప్ర స్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి జరిగే మ్యాచ్‌లలో కనీ సం నాలుగు లేదా ఐదింటిలో గెలవాల్సి ఉంటుంది. ఢిల్లీకి ప్రధాన సమస్య వారి నిలకడ లేని బ్యాటింగే.. ఒక మ్యాచ్‌లో 240 ప్లస్ స్కోరు చేస్తే, తర్వాతి మ్యాచ్‌లో 77 పరుగులకే కుప్పకూలింది.
రాహుల్, నిస్సాంక, నితీ శ్ రాణా, సమీర్ రిజ్వీ నిలకడగా రాణించలేకపోతుండడం మైనస్‌గా మారింది. ఢిల్లీని వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిపించిన రిజ్వీ మళ్లీ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. స్టబ్స్, మిల్లర్ కూడా ఫినిషింగ్ రోల్స్‌లో సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. విప్రజ్ నిగమ్ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ పూర్తిస్థాయిలో గాడిన పడితే తప్ప ఢిల్లీ పుంజుకునే అవకాశం లేదు. అటు బౌ లింగ్‌లో మిఛెల్ స్టార్క్ జట్టుతో చేరడం ఢిల్లీ కి బలాన్ని పెంచేదే.
గాయం కారణంగా 8 మ్యాచ్‌లకు దూరమైన స్టార్క్‌కు ఆసీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జట్టుతో కలిసాడు. ఇప్పుడు లుంగి ఎంగిడి కూడా దూరమవడంతో స్టార్క్ పైనే భారం పడనుంది. అటు చమీరా లేదా జేమీసన్‌లో ఒకరికి ప్లేస్ దక్కనుంది. ముకేశ్ కుమార్ కూడా ఢిల్లీ పేస్ ఎటాక్‌లో కీలకంగా ఉన్నాడు. స్పిన్నర్లు కుల్దీ ప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇంకా మెరుగ్గా రాణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం సూపర్ ఫామ్‌లో ఉంది. సన్ రైజర్స్ చేతిలో పరాజ యం పాలైన తర్వాత కాస్త తడబడినా మళ్ళీ పుంజుకుంది. లక్నో, పంజాబ్ జట్లపై విజయాలను అందుకుంది. బ్యాటింగ్‌లో జైస్వా ల్, వైభవ్ సూర్యవంశీ ఇచ్చే ఆరంభాలే రాజస్థాన్ విజయాల్లో కీలకంగా ఉంటున్నాయి.
ముఖ్యంగా వైభవ్‌ను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. కొద్దిసేపే క్రీజులో ఉన్నా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అలాగే జు రెల్, ఫెరీరా, జడేజా కూడా రాజస్థాన్ బ్యా టింగ్ ఆర్డర్‌లో కీలకంగా ఉన్నారు. అయితే రియాన్ పరాగ్ కెప్టెన్‌గా పర్వాలేదనిపిస్తు న్నా బ్యాటర్‌గా ఫ్లాప్ అవుతున్నాడు. బౌలిం గ్‌లో ఆర్చర్ పైనే భారం పడింది. బర్గర్, య శ్ రాజ్ పూనియా కూడా రాణిస్తుండడంతో రాయల్స్ బౌలింగ్ పటిష్టంగా మారింది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి.
తుది జట్లు అంచనా
ఢిల్లీ క్యాపిటల్స్ : పోరెల్, కెఎల్ రాహు ల్, నితీశ్ రాణా, రిజ్వీ, స్టబ్స్, అక్షర్ పటేల్, మిల్లర్, విప్రజ్, జేమీసన్ లేదా చమీరా, మిఛెల్ స్టార్క్, కుల్దీప్
రాజస్థాన్ రాయల్స్ : జైస్వాల్, వైభవ్ , జురెల్, పరాగ్, శనక, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బ్రిజేశ్, బర్గర్, యశ్‌రాజ్ పూనియా






