1 May, 2026 | 3:32 AM

గుజరాత్ ఆల్ రౌండ్ షో

01-05-2026 01:59 AM

ఆర్సీబీపై ప్రతీకార విజయం

అదరగొట్టిన అర్షద్ ఖాన్

గిల్, బట్లర్ మెరుపులు

ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ వరుస విజయాలతో అదరగొట్టిన జట్లకు ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకుంది. తమ హోంగ్రౌండ్‌లో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో అర్షద్ ఖాన్, బ్యాటింగ్‌లో గిల్, బట్లర్ రాణించారు.

అహ్మదాబాద్, ఏప్రిల్ 30: ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీస్కోర్లు సాధిస్తూ విజయాలను అందుకుంటున్న బెంగళూరు ఉత్సా హంగా బ్యాటింగ్ ప్రారంభించినా కాసేపటికే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బెథెల్, కోహ్లీ అనుకున్న స్థాయిలో ఆరంభాన్నివ్వలేకపోయారు.

బెథెల్ (5), కోహ్లీ (2)8, జితేశ్ శర్మ (1), టిమ్ డేవిడ్ (9), కృనాల్ పాండ్యా (4) పరుగులకే ఔటయ్యారు. దీంతో బెంగళూరు దూకుడుగా ఆడినా 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 7.3 ఓవర్లలో 79/2తో పటిష్ట స్థితిలో ఉన్న ఆర్సీబీ.. ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి.. అను కున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ దశలో దేవదత్ పడిక్కల్ మరో సారి ఆదుకున్నాడు. షెఫర్డ్‌తో కలిసి 30 పరుగులు జోడించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించారు.

ఫలితంగా ఆర్సీబీ కోలుకోలేకపో యింది. చివర్లో రొమారియో షెఫర్డ్ (17), వెంకటేశ్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్ (15) పోరాడటంతో ఆర్సీబీ 150 పరుగుల మార్కును దాటింది. చివరకు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. దేవ్‌దత్ పడిక్కల్ 24 బంతుల్లో 40 రన్స్ చేసి, టాప్ స్కోరర్గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు.

జేసన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 2, మహమ్మ ద్ సిరాజ్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక క్యాచ్‌లు పట్టిన జేసన్ హోల్డర్.. ఆర్సీబీ తక్కువ స్కోరుకు పరిమితం అవ్వడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అతడు పట్టిన రజత్ పటీ దార్ క్యాచ్‌పై వివాదం చెలరేగింది. అతడి చేతులో ఉండగానే బంతి.. నేలను తాకినట్లు వీడియోలో కనిపించింది. కానీ అంపైర్లు మాత్రం రీప్లేలు పరిశీలించకుండానే ఔట్‌గా ప్రకటించారు. దీనిపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశా డు. ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ఆడింది.

రన్ రేట్ పెంచుకోవాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్‌కు గిల్, సా యి సుదర్శన్ 3 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. పవర్ ప్లేలోనే గుజరాత్ 69 పరుగులు చేసింది. గిల్ కేవలం 18 బంతుల్లోనే 43 రన్స్ చేశాడు. బట్లర్ 19 బంతుల్లో 39 పరుగులు చేయగా.. మిడిల్ ఓవర్లలో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా లేకపోవడంతో తెవాటియా, రషీద్ ఖాన్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

స్కోరు బోర్డు

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 155 ఆలౌట్ ( పడిక్కల్ 40, కోహ్లీ 28, పటిదార్ 19 ; అర్షద్ ఖాన్ 3/22, రషీద్ ఖాన్ 2/19 )

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 158/5 ( గిల్ 43, బట్లర్ 39, తెవాటియా 27 ; భువనేశ్వర్ 3/28, షెఫర్డ్ 2/30 )