29 March, 2026 | 6:08 AM

అంబులెన్స్‌లో ప్రసవం

16-05-2024 02:21 AM

రాజన్న సిరిసిల్ల, మే 15 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా చందర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గంట స్వప్న అనే మహిళ అంబులెన్స్‌లో ప్రసవించింది. గర్భవతి అయిన స్వప్నకు బుధవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు 108కి సమాచారమిచ్చారు. అంబులెన్స్‌లో వెళ్తున్న క్రమంలోనే నొప్పులు ఎక్కువ కావడంతో వైద్య సిబ్బంది ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం చందర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.