29 March, 2026 | 7:38 AM

యువకుడు అదృశ్యం

16-05-2024 02:20 AM

వరంగల్ తూర్పు, మే 15: వరంగల్ నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువ కుడు అదృశ్యమయ్యాడు. యువకుడి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన తొగరు వినయ్‌కుమార్ (25) గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో పాటు ఫోన్‌లో సైతం అందుబాటులో లేకపోవడంతో తండ్రి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశా డు. విచారణ ప్రారంభించిన పోలీసులు చివరి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హనుమకొండ బస్టాండ్ ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. హనుమకొండ బస్టాండ్‌లోని సీసీ ఫుటేజీ పరిశీలించి.. వినయ్‌కుమార్ బస్టాండ్ నుంచి వెళ్తున్నట్లు గుర్తించారు. సదరు యువకుడు వరంగల్ స్టేషన్ రోడ్డు లో సీసీ కెమెరాల షాపును నిర్వహిస్తున్నాడు. మిస్సింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.