calender_icon.png 9 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ

09-11-2025 01:54:16 AM

  1. ‘ఓట్ చోరీ’పై రాహుల్‌గాంధీ ఎనలేని పోరాటం 
  2. అవకతవకలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపణ
  3. పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాం తి): బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీపీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ ఆందోళనవ్యక్తం చేశా రు. ‘ఓట్ చోరీ’పై రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని,దీనిపై కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణకు 5 కోట్ల మంది కిపైగా మద్దతు తెలిపినట్టు వెల్లడించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.

లోక్ సభ ఎన్నికలతో పాటు మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపి స్తోందని తెలిపారు. హర్యానాలో 5 లక్షలకుపైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరు నామాలు, లక్షమందికిపైగా ఓటర్ల ఫొటోల వివరాలు తప్పులుండటాన్ని రాహుల్ గాంధీ నిరూపించారని చెప్పారు. తమకు సంబంధించని ఓట్లను బీహార్‌లో ‘సర్’ పేరుతో బీజేపీ తొలగించిందని మండిపడ్డారు. 

ఓట్ చోరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి యా బీజేపీ చెప్పు చేతుల్లో ఉందని ఆరోపించారు. జూబ్లీ హిల్స్‌లో పక్క జిల్లాల ఓటర్లు నమోదు చేసుకొని గతంలో బీజేపీ సహకారంతో బీఆర్‌ఎస్ గెలుస్తూ వచ్చిందని తెలిపారు. సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, అల్లం భాస్కర్, హనుమంతు రావు, లింగం యాదవ్, గజ్జి భాస్కర్  పాల్గొన్నారు.