3 May, 2026 | 6:10 PM

అక్రమ కట్టడం కూల్చివేత

26-06-2024 12:05 AM

వెల్దుర్తి, జూన్ 25:  పంచాయతీ అనుమతి లేకుండా వెల్దుర్తిలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ కట్టడాన్ని మంగళవారం పంచాయతీ కార్యదర్శి దొమ్మాట బలరాంరెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది కూల్చివేశారు. అక్రమ నిర్మాణంపై కొందరి ఫిర్యాదు మేరకు స్పందిస్తున్నామని, అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధమని పంచాయతీ కార్యదర్శి హెచ్చరించారు.

ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు...

శేరిల్లాలోని బీటీ రోడ్డుపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లపై మంగళవారం వెల్దుర్తి  పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిద్దరిని బైండోవర్ చేసినట్లు వారు తెలిపారు.