3 May, 2026 | 4:43 PM

జాలర్లపై రౌడీ షీటర్ దాడి

26-06-2024 12:05 AM

మణికొండ, జూన్ 25 : చేపలు పడుతున్న మత్స్యకారులను ఓ రౌడీ షీటర్ బెదిరించి వారి వద్ద ఉన్న రూ. 11 వేలు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొందరు మత్స్యకారులు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని పీరంచెరువు వద్ద చేపలు పడుతుండగా కాళీమందిర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో నివాసించే  రౌడీ షీటర్ వారి వద్దకు వచ్చా డు. తాను ఇప్పటికే 34 మర్డర్లు చేశానని, డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరించాడు. ఓ మత్స్యకారుడిపై కత్తితో రెండు సార్లు పొడిచాడు. వారి జేబుల్లోంచి బలవంతంగా రూ. 11 వేలు లాక్కొని పరారయ్యాడు. బాధితులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, సదరు రౌడీ షీటర్ వారం రోజుల క్రితమే జైలు నుంచి వచ్చాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.