3 May, 2026 | 3:07 AM

ప్రజాస్వామ్య మనుగడకు ఓటే ఆయుధం

28-04-2024 12:10 AM

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య మను గడకు ఓటు ఆయుధమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఉద్ఘాటించా రు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మే 13న ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని పిలుపుని చ్చారు. హైదరాబాద్‌లో ఓటరు స్లిప్‌ల పంపి ణీ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఆర్ నగర్‌లోని సీఈఓ వికాస్‌రాజ్, బంజారాహిల్స్ లోని డీజీపీ రవిగుప్తా నివాసాలకు వెళ్లి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ శనివారం ఓటర్ స్లిప్పుల ను అందజేశారు. అనంతరం వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎపిక్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదని, జాబితాలో మీ పేరు ఉందో లేదో కచ్చితంగా సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు చూపించే ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలన్నారు.

ఈ సందర్భంగా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులతో పాటు ఓటరుగా గర్వపడుతున్నాను అనే స్టిక్కర్లను ఇంటింటికీ పంపిణీకి సంబంధించిన వివరాలను వికాస్‌రాజ్ అడిగి తెలుసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్లమెం ట్ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలన్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్‌రావు, జూబ్లీహిల్స్, బేగంపేట డిప్యూటీ కమిషనర్లు ప్రశాం తి, సమ్మయ్య పాల్గొన్నారు.