10-12-2025 12:06:09 AM
మునిపల్లి, డిసెంబర్ 9 : మండల కేంద్రమైన మునిపల్లి, పెద్దగోపులారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదో తరగతిలో ఉన్నతమైన ఫలితాలు సాధించి జిల్లాలోనే అత్యుత్తమ గ్రేడ్లను పొందాలని, అందుకు విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం పదో తరగతి ప్రత్యేక తరగతుల గూర్చి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఐఎఫ్ ఫి ప్యానల్స్ ఉపయోగించడంపై ఆయన అభినందించారు. అంతకు ముందు కాన్ అకాడమీ తెలుసుకుంటూ విద్యార్థులచే ప్రాక్టీస్ చేయించారు. ఆయన వెంట కాంప్లెక్స్ ప్ర ధానోపాధ్యాయుడు తుకారాం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ , ఉపాధ్యాయుడు వీరన్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. భాస్కర్, ఉపాధ్యా యులు ఏ నాగేశ్వర్, టి కృష్ణవేణి, ఆర్ ప్రశాంత్ కుమార్ రాజు, తదితరులు ఉన్నారు.