10-12-2025 12:03:40 AM
మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి
కొండాపూర్, డిసెంబర్ 9 : కాంగ్రెస్ పార్టీలో ఉన్నానో లేదో తనకు తెలియడం లేదని, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని ప్రచారం మాత్రం జరుగుతుంది తప్పా ఎలాంటి సమాచారం తనకు లేదని కొండాపూర్ మండల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి సర్పంచిగా పోటీ చేస్తున్న సడాకుల కుమార్ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. మల్కాపూర్ గ్రామ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేసి తనను సస్పెండ్ చేశారంటూ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ లో ఉన్నానో లేదో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదని డిమాండ్ చేశారు.