calender_icon.png 13 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం

10-12-2025 12:09:42 AM

సిద్దిపేటలో దీక్ష విజయ్ దివాస్ 

సిద్దిపేట, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ ఎమ్మెల్సీ పారిపోసాన్ అన్నారు. మంగళవారం సిద్దిపేటలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష విజయ్ దివాస్ నిర్వహించారు. స్థానిక కోటిలింగాల ఆలయం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పాత బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.

కెసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే డిసెంబర్ 9 నాడు నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కి తీసుకుందన్నారు. కెసిఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని వెల్లడించారు. నీళ్ళు, నిధులు, నియామకాలు దిశగా రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందన్నారు. తెలంగాణ బీడు భూములను పచ్చని మాగానాలుగా చేశారని చెప్పారు.

బంగారు తెలంగాణను భవిష్యత్తు లేని తెలంగాణగా నేటి పాలకులు మార్చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కృషితో సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు రాజనర్సు, సాయిరాం, శ్రీనివాస్, బాలమల్లు, పాపయ్య, ఆంజనేయులు, కనకరాజు, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.