9 June, 2026 | 2:56 PM

స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి

09-06-2026 01:38 PM

హైదరాబాద్: జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం పర్యటించారు. రూ.66.62 కోట్లతో నిర్మించే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినంతరం ఉప ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన 33/11, 132/33 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రఘునాథపాలెంలో 233 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

గతంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, దేవాదులకు నిధులు మంజూరుతో పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఒకేసారి రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రైతు నుంచి ప్రతి ధాన్యపు గింజను, తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని కొనియాడారు.  ఇప్పటికి 72 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించి రూ.14 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.