calender_icon.png 22 May, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహోన్నత వ్యక్తి పెన్నా అనంతరామ శర్మ

22-05-2025 05:14:32 PM

వారి ఆశయాలు ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం..

కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్తు లేదు..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు పెన్నా అనంతరామ శర్మ అని సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి(CPI(M) District Secretary Tummala Veera Reddy), రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనములో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు లేదని కొందరు వాదిస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్తు లేదని అన్నారు. అనంత రామ శర్మ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారని పేర్కొన్నారు.

నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన అనంతరామ శర్మ  గారు మన మధ్య లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. ఆయనతో మాకు  సన్నిహిత సంబంధం ఉందని నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి  శర్మ అని పేర్కొన్నారు. పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడి వరకు పనిచేశారని గుర్తు చేశారు. కార్మిక ఉద్యమంలో అనేక యూనియన్లను నిర్మాణం చేయడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. పాలకులు రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

నేటి రాజకీయాలు కలుషితమయ్యాయని నేటి నాయకులు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో పనిచేయాలని సూచించారు. వారి ఆశయాలు ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం, సయ్యద్ హాశం, సిహెచ్ లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పుచ్చకాయలు నర్సిరెడ్డి, గంజి మురళీధర్, సైదులు, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, ఖమ్మంపాటి శంకర్, ఆకారపు నరేష్, మన్నెం బిక్షం, కోట్ల అశోక్ రెడ్డి, గాద నరసింహ, పి మధుసూదన్ రెడ్డి, బొల్లు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.