22-05-2025 05:32:49 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్బంగా రామవరం సిఅర్పి క్యాంపులోని హనుమాన్ ఆలయం వద్ద కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గురువారం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా(CPI Party District Secretary Sabir Pasha) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా ఈ ఆలయ ప్రాంగణంలో కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించటం ఎంతో అభినందనీయం అని కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కంచర్ల జమలయ్య, పాటి మోహన్రావు మునిగడప వెంకటేశ్వర్లు, గుత్తుల శ్రీనివాస్, మర్రి గోపికృష్ణ, సుధాకర్ రాజు, అశోక్, దిలీప్ గుప్తా, సందబోయిన శ్రీనివాస్, కుమార్, సతీష్, జాన్, ఏసు, చిన్న, మిల్కీ, యూత్ సభ్యులు పాల్గొన్నారు.