calender_icon.png 22 May, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70 లక్షల నిధులతో పాల శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన

22-05-2025 06:00:16 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో రూ.75 లక్షల నిధులతో రోజుకు 15 వేల లీటర్ల సామర్థ్య పాల శీతలీకరణ కేంద్రం భవన నిర్మాణానికి గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి డివిజన్ లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండేదని ప్రస్తుతం రోజురోజుకు పాల ఉత్పత్తి తగ్గుతుందని అందుకే డిఆర్డిఏ(DRDA) ద్వారా మహిళా రైతులకు సబ్సిడీపై గేదెలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విజయ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమభివృద్ధి ఛైర్మన్ గుత్త అమిత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం తరఫున నడుస్తున్న విజయ పాల డైరీకి రైతులు అండగా నిలిచి పాలను విజయ డైరీలోనే పోయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ పాల కేంద్రాలు బిఎంసిలను మరింత బలోపేతం చేసి మరింత పాల ఉత్పత్తికి కృషి చేస్తున్నమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా ఉంటూ ప్రతి మహిళకు గేదెలను పంపిణీ చేసి వడ్డీ లేని రుణాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విజయ డైరీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కామారెడ్డి జిల్లా విజయ డైరీ సెక్రటరీ నంద కుమారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మండల యూత్ కాంగ్రెస్, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.